చిరంజీవి సినిమాపై ఆశలు లేవు అంటున్న మహానటి....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పటి మహానటి గా పేరున్న హీరోయిన్ కీర్తి సురేష్ ఈ మధ్య కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదు. తాను నాని తో కలిసి నటించిన దసరా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత మాత్రమే కొత్త సినిమాలకు ఓకే చెబుతానంటూ కండిషన్ పెడుతుందట.
ఈ మధ్య కాలంలో ఇద్దరు ముగ్గురు తెలుగు నిర్మాతలు ఆమె ను తమ సినిమాల్లో నటించాల్సిందిగా సంప్రదించడం జరిగిందట. కానీ ఇప్పటి వరకు ఆమె ఏ ఒక్క సినిమాకి ఓకే చెప్పలేదు.
దసరా సినిమా విడుదలైన తర్వాత మాత్రమే కొత్త సినిమా ఒప్పుకుంటానని ఆమె చెప్పడం తో ప్రస్తుతం ఆమె తో సినిమాలు చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలు దసరా సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.మరో వైపు చిరంజీవి హీరో గా నటిస్తున్న భోళా శంకర్ చిత్రం లో కూడా ఈమె నటిస్తోంది. అయితే ఆ సినిమా లో చిరంజీవి కి చెల్లెలి పాత్ర లో నటిస్తున్న కారణంగా కీర్తి సురేష్ కి ఆ సినిమా పై ఎక్కువగా ఆశలు లేవు, కానీ దసరా సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకాన్ని కలిగి ఉంది. అందుకే దసరా సినిమా విడుదలైన తర్వాత మాత్రమే తన తదుపరి సినిమాని కమిట్ అవుతానంటూ చెప్పుకొచ్చింది. దసరా సినిమా హిట్ అయితే కచ్చితంగా కీర్తి సురేష్ మూడు కోట్ల పారితోషికం డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో కూడా కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలకు కమిట్ అవ్వడం లేదు. తన స్థాయికి తగ్గట్లుగా మంచి సినిమాల్లో నటించే అవకాశం రావడం లేదు అంటూ ఆమె వచ్చిన ఆఫర్లను కాదంటుందట. దసరా సినిమా తర్వాత తమిళనాట కూడా మంచి పాపులారిటీని ఈ అమ్మడు దక్కించుకుంటుందేమో చూడాలి.
ఐతే ఆమె చెప్పిన వ్యాఖ్యలకి మెగా అభిమానులు ఆశలు పెట్టుకోకపోవడం పై సోషల్ మీడియా లో ఆమె పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: