NBK -108 ఈసారి కూడా పక్కా సక్సెస్.. ఫస్ట్ లుక్ వైరల్..!!

Divya
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బాలయ్య. ప్రస్తుతం తన 108వ సినిమాని సెట్స్ మీదికి తీసుకువెళ్లారు అనిల్ రావుపూడి. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఉగాది పండుగ సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ నందమూరి అభిమానులలో ఫుల్ ఖుషి నింపేలా కనిపిస్తోంది. బాలకృష్ణ ఫస్ట్ లుక్ అయితే అరుపులు పెట్టించేలా ఉందని థిస్ టైం బియాండ్ యువర్ ఎమోజినేషన్ అని మీరు ఎన్ని ఊహించుకున్న అంతకుమించి అనేలా ఉంటుందంటూ ఫస్ట్లు పోస్టర్తో తెలియజేశారు డైరెక్టర్ అనిల్ రావు పూడి.
పటాస్ నుంచి ఎఫ్ త్రీ వరకు డైరెక్టర్ గా తను ఎప్పుడు ఫెయిల్ అని అనిపించుకోలేదు..ఫస్ట్ టైం ఒకపక్క మాస్ హీరోతో సినిమా చేయబోతున్నారు అయితే ఈ చిత్రంలో బాలయ్య మార్క్ మాస్ అంశాలను ఉంచుతూనే తన మార్కు కామెడీతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే నందమూరి అభిమానులు సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పవచ్చు.ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్యను ఒక రేంజ్ లో చూపించబోతున్నారు డైరెక్టర్ అనిల్ రావు పూడి అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

స్వతాక బాలకృష్ణ అభిమాని అయిన డైరెక్టర్ అనిల్ రావుపూడి ఒక అభిమానిని ఎలా చూపించాలని కోరుకుంటారో బాలయ్యని అలా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నది. బాలయ్య చెల్లెలి పాత్రలో శ్రీ లీల కూడా నటిస్తున్నట్లు సమాచారం.ఇంకా ఈ సినిమా సర్ప్రైజ్లు ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. వరుస సినిమాలతో సక్సెస్ లో ఉన్న బాలయ్య ఈ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రచ్చ చేస్తున్న ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: