దాస్ కా ధమ్కీ ఎంత వసూలు చేస్తే సేఫ్ అవుద్ది?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో, హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా మంచి జోష్ లో దూసుకుపోతున్నాడు.ఇక ఈ ఉగాది పండుగ నాడు మార్చ్ 22న అయితే విశ్వక్ సినిమాపై భారీగా హైప్ పెంచేశాడు. ఇటీవల దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి విశ్వక్ ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తాడా చూడాలి. అనే కామెడీ అండ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాతో రాబోతున్నాడు.పైగా ఈ సినిమాలో తాను కేవలం హీరోగా నటించడమే కాక దర్శకత్వం, నిర్మాణం కూడా  చేయడం గమనార్హం.ఇక ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో తమిళ హాట్ బ్యూటీ నివేతా పేతురేజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక దాస్ కా ధమ్కీ విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇంకా అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా విశ్వక్ సేన్ కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలిచింది.దాస్ కా ధమ్కీ సినిమా నైజాంలో 3 కోట్లు, సీడెడ్ లో ఒక కోటి ఇంకా అలాగే ఆంధ్రాలో 2.8 కోట్లు బిజినెస్ చేసింది.


ఇక రెస్టాఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో కలిపి 70 లక్షల బిజినెస్ చేసింది.మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 7.50 కోట్లు అయింది.దీంతో ఇది విశ్వక్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీగా నిలిచింది.గతంలో పాగల్ సినిమా మొత్తం 6.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఇప్పుడు దాస్ కా ధమ్కీ 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో కనీసం 8 కోట్లు షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వదు. ఇక హిట్ కొట్టాలంటే కనీసం 10 కోట్లు షేర్ ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే.అయితే విశ్వక్ సేన్ చాలా తెలివిగా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా హైప్ పెంచేశాడు. ఇటీవల దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రావడంతో ఈ సినిమా సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఈ సినిమాపై తాను కూడా మరిన్ని అసలు ఇంకా నమ్మకం పెట్టుకున్నాడు.మరి విశ్వక్ సేన్ ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తాడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: