చిరంజీవి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు..!!

murali krishna
కలెక్షన్ కింగ్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మోహన్ బాబు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే.చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన మోహన్ బాబు సినిమాలపై వున్నఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు..ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. విలక్షణ నటుడిగా కూడా ఆయన అవకాశాలు అందుకున్నారు.
 ఇక హీరోగా కూడా ఇండస్ట్రీలో స్థిరపడిన మోహన్ బాబు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బానర్ ద్వారా ఎన్నో సినిమాలను కూడా నిర్మిస్తూ నిర్మాతగా మంచి గుర్తింపు ను కూడా పొందారు.
ఇలా ఇండస్ట్రీలో మోహన్ బాబు ఈ స్థాయిలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు అంటే అది అంత ఈజీగా అయితే వచ్చినది కాదు ఈ పేరు ప్రతిష్టల వెనుక ఎన్నో అవమానాలు అలాగే కష్టాలు ఉన్నాయని ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ కెరియర్ లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా తెలిపారు. ఇకపోతే నేడు ఈయన తన 71వ పుట్టినరోజు ను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మోహన్ బాబు తన కెరియర్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
తాను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను అయితే ఎదుర్కొన్నానని కొన్ని ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని తెలిపారు.. ఇక చిరంజీవి తో విభేదాలు గురించి కూడా ఆయన తెలిపారు. మేమిద్దరం భార్యాభర్తల లాగా చిన్నచిన్న గొడవలు పోట్లాటలు చేసుకుంటాం అంతే తప్ప ఇద్దరం కూడా ఎన్నో సందర్భాలలో ఎదురు పడి మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇకపోతే తాను బయటకు గంభీరంగా కనిపించిన కానీ చాలా ఎమోషనల్ పర్సన్ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.తాను కొన్ని సందర్భాలలో తన ఎమోషన్స్ అస్సలు కంట్రోల్ చేసుకోలేనని తెలియజేశారు.ఇలా తాను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు మరణించినప్పుడు అలాగే నటశేఖరుడు కృష్ణ  మరణించినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. ఇక తాజాగా తన కుమారుడు మంచు మనోజ్ పెళ్లి వేడుకలలో కూడా తన ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నానన మోహన్ బాబు తెలియజేశారటా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: