క్లాస్ లుక్ లో మైమారపిస్తున్న సంతోష్ శోభన్ హీరోయిన్..!

Pulgam Srinivas
తమిళ సి
నిమాల ద్వారా మంచు గుర్తింపును సంపాదించుకున్న ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తమిళ మూవీ లలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. పోయిన సంవత్సరం విడుదలైన తిరు మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తమిళ్ నుండి డబ్బింగ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఈ పాత్ర ద్వారా ప్రియ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన కళ్యాణం కమనీయం అనే మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా తెలుగు సినీ ప్రేమికులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.
ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయినప్పటికీ ప్రియ కు మాత్రం ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని డీసెంట్ లుక్ లో ఫోటో కు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియ కు సంబందించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: