వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం అయినా "ధమాకా" మూవీ..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ ఇప్పటికి ఎన్నో పవర్ఫుల్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ పోయిన సంవత్సరం ఏకంగా 3 మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదట రవితేజ పోయిన సంవత్సరం ఖిలాడి మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాగా ... ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించ లేక పోయాయి. ఆ తర్వాత ధమాకా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన రవితేజ ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ కి త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించగా శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ తాజాగా ఈ మూవీ ని స్టార్ మా చానల్లో మార్చి 26 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నట్లు అధికారకంగా ప్రకటించింది. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అదిరిపోయే రేంజ్ కలక్షన్ లను వసులు చేసిన ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: