ఆ స్టార్ హీరో కేరిర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాంగ్.....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఐతే ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన యువ హీరోలలో నందమూరి కళ్యాణరామ్ ఒకరు. ఐతే  కళ్యాణ్ రామ్ సినిమాకు హిట్ టాక్ వస్తే భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తుండగా సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం దారుణంగా కలెక్షన్లు వస్తున్నాయి.
బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కు భారీ రేంజ్ లో లాభాలను మిగల్చగా అమిగోస్ సినిమా మాత్రం భారీ నష్టాలను మిగల్చడం గమనార్హం. బింబిసార ఫస్ట్ డే కలెక్షన్లను అమిగోస్ ఫుల్ రన్ లో బ్రేక్ చేయలేదనే సంగతి తెలిసిందే.
అయితే అమిగోస్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న డెవిల్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ మార్కెట్ తో పోల్చి చూస్తే ఈ మొత్తం చాలా ఎక్కువని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సాంగ్ కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సాంగ్ అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు కథ, మాటలు అందించగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బ్రిటిష్ ప్రభుత్వంలో పని చేసే ఇండియన్ స్పై రోల్ లో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. అభిషేక్ నామా ఈ సినిమాకు నిర్మాత కాగా ఖర్చు విషయంలో ఆయన రాజీ పడటం లేదు. కళ్యాణ్ రామ్ బింబిసార2 సినిమాకు డైరెక్టర్ మారారని ఇండస్ట్రీలో వినిపిస్తుండగా ఈ ప్రచారంలో స్పష్టత రావాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ కు డెవిల్ సినిమా సక్సెస్ సాధించడం కెరీర్ పరంగా కీలకమని చెప్పవచ్చు. కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఏదేమైనా ఆ కుటుంబం నుండి వచ్చిన స్టార్ హీరోల్లో మొదటి జూనియర్ ఎన్టీఆర్ ఆయన స్టైల్ లో ఇండస్ట్రీ లో రాణించి పాన్ ఇండియా స్థాయి కి ఏదిగ్యరు. ఐతే అలాంటి అవకాశం కోసం నందమూరి కళ్యాణ్ రామ్ కూడా బాగా ట్రై చేస్తున్నారు. కాకపోతే ఆయన మూవీ ఆ స్థాయి కి చేరడం లేదు. భవిష్యత్ లో ఆయన కూడా ఆ స్థాయి కి చేరాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: