నరేష్ "ఉగ్రం" మూవీ నుండి క్రేజీ అప్డేట్ ను విడుదల చేసిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలలో ... ఎన్నో మూవీ లలో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటుడు గా తనకంటూ అదిరిపోయే గుర్తింపు ను సంపాదించుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో కామెడీ సినిమాల్లో నటించి ఎక్కువ ప్రాధాన్యత ను సంపాదించుకున్న నరేష్ ఈ మధ్య కాలంలో కామెడీ సినిమా లకు కాస్త దూరంగా ఉంటూ ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాలకు ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాడు.
 

అందులో భాగంగా నరేష్ వరుసగా నాంది ... ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే మూవీ లలో హీరో గా నటించి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నరేష్ ... విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందుతున్న ఉగ్రం అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యే ... చాలా బాగా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి "దేవేరి" అనే పాటను మార్చి 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి దేవేరి సాంగ్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ను విడుదల చేసింది. ఈ సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శరత్ సిటీ మాల్ ... గచ్చిబౌలి లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సాయి చరణ్ పాకాల సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: