"ఆర్సి15" కు ఆ టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫామ్..!

Pulgam Srinivas
భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ గురించి ఆయన టాలెంట్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో గ్రేట్ బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించిన శంకర్ ప్రస్తుతం ఇండియా లోనే టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తున్నాడు. శంకర్ ఆఖరుగా రజనీ కాంత్ హీరో గా రూపొందిన రోబో 2.0 సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ రోబో రేంజ్ విజయాన్ని సాధించక పోయినప్పటికీ భారీ కలెక్షన్ లను మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ తో పాటు ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ గా కనిపించబోతున్నాడు. సునీల్ , అంజలి , శ్రీకాంత్ ఈ మూవీ.లో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ఈ మూవీ.కి చిత్ర బృందం టైటిల్  ను ఫిక్స్ చేయకపోవడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆర్ సి 25 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి "సీఈఓ" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ టైటిల్ ని ఈ చిత్ర బృందం మొత్తం కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ టైటిల్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: