"కస్టడీ" మూవీ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో నాగ చైతన్య ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం మరి కొద్ది రోజుల్లోనే నాగ చైతన్య కస్టడీ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ మే 12 వ తేదీన విడుదల కాపుతుంది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే నాగ చైతన్య హీరో గా రూపొందిన ఈ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... అరవింద స్వామి , ప్రియ మణి ముఖ్య పాత్రలలో నటించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఇప్పటి వరకు ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో 12 మిలియన్ వ్యూస్ ను ... 153 కే లైక్ లను సాధించి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు ... తమిళ భాషల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ తో నాగ చైతన్య ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి. నాగ చైతన్య ... కృతి శెట్టి ఇది వరకే బంగార్రాజు మూవీ లో కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: