మగధీర రీ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ లుగా నిలిచిన వాటిలో మగధీర సినిమా ఒకటి. ఈ మూవీ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... ఏం ఏం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందించాడు. కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించగా ... రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కి కథ ను అందించాడు. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో రెండవ మూవీ గా రూపొందింది.
 

ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను మించి ఉండడంతో ఈ మూవీ కి ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. అలాగే ఈ మూవీ అప్పట్లో ఎన్నో అదిరిపోయే రేంజ్ రికార్డ్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో రికార్డులను సృష్టించిన ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం ధియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు దగ్గర పడడంతో మగధీర సినిమా రీ రిలీజ్ ఆగిపోయింది అని అనేక వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ వార్తలపై మగధీర మూవీ యూనిట్ అధికారికంగా స్పందిస్తూ ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. తాజాగా మగధీర మూవీ యూనిట్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను థియేటర్ లలో రీ రిలీజ్ చేయాలి అనుకున్నాం ... కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ మూవీ ని రామ్ చరణ్ పుట్టిన రోజు వరకు రీ రిలీజ్ చేయలేకపోతున్నాం ... మరో మంచి సమయం చూసి ఈ మూవీ ని థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తాము అని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: