"కబ్జా" మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
శాండిల్ వుడ్ సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న ఉపేంద్ర మరియు కిచ్చ సుదీప్ లు తాజాగా కబ్జా అనే మూవీ లో కలిసి నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్ చంద్రు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శ్రేయ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... రవి బుస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ నిన్న అనగా మార్చి 17 వ తేదీన భారీ అంచనాల నడుమ కన్నడ , తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ కావడం ... అలాగే ఈ సినిమాకు ప్రమోషన్ లను కూడా చాలా ఎక్కువగా చేయడం ..  అలాగే ఈ మూవీ లోని ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టు కోవడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఓపెనింగ్ లు లభించాయి. మరి ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


కబ్జా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు మంచి అంచనాల నడుమ విడుదల అయింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.45 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి కర్ణాటక రాష్ట్రంలో మొదటి రోజు 8.45 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. అలాగే ఇతర రాష్ట్రాలలో ఈ మూవీ కి మొదటి రోజు ఒక కోటి వరకు కలెక్షన్ లు వచ్చాయి. అలాగే నార్త్ బెల్ట్ లో ఈ మూవీ కి మొదటి రోజు 1.50 కోట్ల రేంజ్ లో కలెక్షన్ లు లభించాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 13.55 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఇలా మొదటి రోజు కబ్జా మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా పరవాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: