ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగబాబు..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మూవీ లలో ఆరెంజ్ మూవీ ఒకటి. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో మూడవ మూవీ గా రూపొందింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా ... జానీలియా ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. కొణిదల నాగబాబు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ సినిమాకు హరిజ్ జయరాజ్ సంగీతం అందించాడు. ఈ మూవీ లోని పాటలు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంటూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే మగధీర లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు ఎంతో మంది సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆరంజ్ సినిమా ప్రేక్షకులను థియేటర్ లలి పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. కానీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో ప్రశంసలు లభించాయి. ఈ మూవీ ఇప్పటికీ కూడా టీవీ లో ప్రసారం అయినప్పుడు అదిరిపోయారని టీఆర్పీని తెచ్చుకుంటుంది. చాలా మంది ఇది సూపర్ హిట్ కావాల్సిన సినిమా అని ప్రశంసించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే థియేటర్ లలో ఆ కాలంలో ప్రేక్షకులను అలరించలేకపోయి ... తర్వాత బుల్లి తెరపై ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో రీ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించి నాగబాబు ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. ఈ మూవీ ని మార్చి 25 మరియు 26 తేదీలలో థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ నిర్మాత నాగబాబు అధికారికంగా ప్రకటించాడు. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: