బాలీవుడ్ స్టార్ హీరో మూవీ డైరెక్ట్ "ఓటిటి" లో విడుదల కానుందా..?

Pulgam Srinivas
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ సినిమా లలో నటించి అద్భుతమైన క్రేజ్ ను హిందీ సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న ఈ హీరో ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం లేదు. ఇది ఇలా ఉంటే అక్షయ్ కుమార్ ఆఖరుగా సెల్ఫీ అనే మూవీ లో హీరో గా నటించాడు.

ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కాకపోతే ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ మూవీ గా మిగిలిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా అక్షయ్ కుమార్ "ఓ మై గాడ్ 2" మూవీ లో హీరో గా నటించాడు. అమిత్ రాయ్ రచన , దర్శకత్వం వహించిన ఈ మూవీ లో పంకజ్ త్రిపాఠి , యామీ గౌతమ్ మరియు గోవింద్ నామ్‌దేవ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ మరియు వకావో ఫిల్మ్ ప్రొడక్షన్ వారు ఈ మూవీని నిర్మించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలి అని ఈ మూవీ మేకర్స్ డిసైడ్ అయినట్లు ... అందులో భాగంగా ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను వోట్ లేదా జీయో సంస్థకు అమ్మివేసే ఆలోచనలు ఈ చిత్ర బృందం ఉన్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: