విశ్వక్ సేన్ మాటలకి బాధపడ్డనన్న ఎన్టీఆర్....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్స్టార్ హీరో లో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన సంగతి అందరికి తెలిసిందే.
ఐతే ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ మాట్లాడిన విధంగా నేను మాట్లాడలేనని విశ్వక్ నాకంటే ఎక్కువ మాట్లాడతాడని తారక్ పేర్కొన్నారు. నా మూడ్ బాగోకపోతే నేను చూసే సినిమాలలో ఈ నగరానికి ఏమైంది మూవీ కూడా ఒకటని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. ఆ మూవీలో విశ్వక్ కామెడీ చేయకుండా నవ్విస్తాడని ఎంటర్టైన్ చేస్తూనే లోపల బాధను దాచుకుంటాడని అలా నటించడం కష్టమని ఎన్టీఆర్ తెలిపారు. డైరెక్టర్ గా కూడా విశ్వక్ సేన్ టాలెంటెడ్ అని అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదని తారక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. యాటిట్యూడ్ తో మాట్లాడే విశ్వక్ సేన్ అంత సాఫ్ట్ క్యారెక్టర్ లో నటించడం చూసి ఆశ్చర్యపోయానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. హిట్ సినిమా చూసి ఆశ్చర్యపోయానని ఆ సినిమాలో విశ్వక్ సేన్ బ్యాలెన్డ్ గా నటించాడని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. దాస్ కా ధమ్కీ తర్వాత విశ్వక్ సేన్ డైరెక్షన్ మానేయాలని కోరుకుంటున్నానని కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి అతను డైరెక్షన్ మానేయాలని తారక్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు ఉన్నదంతా పెట్టేశా నువ్వు ఈవెంట్ కు రావాలి అని విశ్వక్ సేన్ చెబుతుంటే బాధేసిందని ఎన్టీఆర్ అన్నారు. సినిమా అంటే విశ్వక్ సేన్ కు ఎంత ఇష్టమో అప్పుడు అర్థమైందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడానికి ఈ సినిమాకు కష్టపడిన వాళ్లతో పాటు ఆడియన్స్ కూడా కారణమని ఎన్టీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఐతే ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలు ముగించుకొని హైద్రాబాద్ తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ లో బిజీ అవుతున్నారు. ఆయన ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: