రవితేజ ఫ్లాప్ సినిమాకు.. బండ్ల గణేష్ కు అన్ని కోట్ల లాభాలు వచ్చాయా?

praveen
ఒకప్పటి కమెడియన్ ప్రస్తుత నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్.. ఇక నిర్మాతగా కూడా అంతే సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇక బండ్ల గణేష్ సినిమా ఫంక్షన్లలో ఇచ్చే స్పీచ్ లు అయితే వార్తల్లో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్ లు ఇక పవన్ అభిమానులందరికీ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉంటాయి.

 అయితే బండ్ల గణేష్ ఎప్పుడు ఎవరిని పొగుడుతాడు అన్నది మాత్రం ఇటీవల కాలంలో అర్థం కాని విధంగా మారిపోయింది. ఎందుకంటే మొన్నటి వరకు కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే బండ్ల గణేష్ పొగుడుతాడు అని అందరూ అనుకునేవారు. కానీ ఇటీవల ఏకంగా రవితేజ గురించి కూడా అదే రీతిలో పొగడ్తల వర్షం కురిపించాడు బండ్ల గణేష్. దీంతో అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలో ఒక ఇంటర్వ్యూలో రవితేజతో తనకు ఉన్న రిలేషన్ ఇప్పటికే కాదు అంటూ ఎన్నో విషయాలలో ఓపెన్ అయ్యాడు బండ్ల గణేష్.

 బండ్ల గణేష్ నిర్మాతగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సమయంలో చేసిన మొదటి సినిమా రవితేజ నటించిన ఆంజనేయులు సినిమా కావడం గమనార్హం. పరశురాం దర్శకత్వంలో రవితేజ నయనతారలు హీరో హీరోయిన్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు అటు బండ్ల గణేష్ కు నష్టాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవలే అసలు విషయం చెప్పేసాడు బండ్ల గణేష్. రవితేజతో చేసిన ఆంజనేయులు సినిమా వల్ల అయిదు కోట్ల లాభాలు వచ్చాయి అంటూ షాకింగ్ నిజాన్ని బయట పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: