"ఓటిటి" ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్న "పులి మేక" వెబ్ సిరీస్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన కథ నాయకులలో ఒకరు అయినటు వంటి ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ప్రేమ కావాలి మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపును మరియు మంచి విజయాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత లవ్లీ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.
 

ఆ తర్వాత కెరియర్ లో ఎన్నో సినిమాల్లో హీరో గా నటించిన ఆది కి సరైన విజయం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర లభించ లేదు. కాకపోతే ఆది మాత్రం వరస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది "పులి మేక" అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ తో ఆది డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి కూడా కీలకమైన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ తో లావణ్య కూడా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇది ఇలా ఉంటే మొట్ట మొదటి సారి ఆది మరియు లావణ్య "పులి మేక" వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ వెబ్ సిరీస్ జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ లో కొన్ని రోజుల క్రితమే అందుబాటు లోకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 120 మిలియన్ ప్లస్ వ్యూయింగ్ మినిట్స్ ను సాధించినట్లు జీ 5 డిజిటల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ థ్రిల్లింగ్ యాక్షన్ సస్పెన్స్ సిరీస్ కు చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: