దాస్ కా దమ్కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా రెడీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకొని మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఈ నగరానికి ఏమైంది మూవీ తో కెరియర్ ను మొదలు పెట్టి పలకనామ దాస్ మూవీ తో మాస్ హీరోగా గుర్తింపును తెచ్చుకొని ... ఆ తర్వాత ఎన్నో క్లాస్ మూవీ లలో హీరో గా నటించి క్లాస్ హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
 

ఇది ఇలా ఉంటే విశ్వక్ ఆఖరుగా ఓరి దేవుడా అనే మూవీ లో హీరోగా నటించాడు. వెంకటేష్ కీలకపాత్రలో నటించిన ఈ మూవీ కి అశ్విత్ మరిమత్తు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో దాస్ కా దమ్కి అనే మాస్ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి విశ్వక్ దర్శకత్వం కూడా వహించడం విశేషం. నివేత పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను ఈ సినిమ బృందం విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ వేడుకను శిల్పకళా వేదిక హైదరాబాద్ లో మార్చి 17 వ తేదీన సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ... ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రానున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన పనులు ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: