అల్లు అర్జున్ "ఐకాన్" ప్రాజెక్ట్ ఆ యంగ్ హీరో దగ్గరకు వెళ్లిందా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వేణు శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఓ మై ఫ్రెండ్ మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎంసీఏ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన వకీల్ సాబ్ మూవీ కి దర్శకత్వం వహించి కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు వకీల్ సాబ్ మూవీ తర్వాత అల్లు అర్జున్ హీరో గా ఐకాన్ అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభించడం అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాలేదు ... అలాగే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ లోను ... సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో మూవీ లోను నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దానితో ఐకాన్ మూవీ ప్రాజెక్ట్ ఇప్పట్లో స్టార్ట్ కావడం కష్టం అనే ఉద్దేశంతో ఈ దర్శకుడు ఇదే కథను మరో హీరోతో చేయడానికి డిసైడ్ అయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వేణు శ్రీరామ్ "ఐకాన్" కథను నితిన్ తో చేయడానికి డిసైడ్ అయినట్లు ... అందులో భాగంగా నితిన్ కి ఇప్పటికే ఈ కథను చెప్పినట్లు ... నితిన్ కూడా ఈ మూవీ లో నటించిడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: