ఆస్కార్ క్రెడిట్ మొత్తం కూడా అతనిదే : దానయ్య

murali krishna
ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి డివివి నిర్మాతగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని అందుకోవడంలో దానయ్య పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పవచ్చు.ఇక ఈ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ఇప్పటివరకు ఈ సినిమా అవార్డు వేడుకలలో దానయ్య కనిపించకపోవడంతో ఈ సంగతి కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇక ఆస్కార్ వేడుకలలో కూడా ఈయన కనిపించకపోవడంతో ఏదో జరిగింది అంటూ కూడా పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేశారు. అయితే అవన్నీ అవాస్తవమని తాజాగా దానయ్య ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారటా..
ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ ఇండియన్ తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం నిజంగా గర్వించదగ్గ విషయమని చెప్పుకొచ్చారు.ఇలా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అందుకు గల కారణం రాజమౌళి అని ఆయన కృషి కారణంగానే ఈ సినిమాకు అవార్డు వచ్చిందని ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే చెల్లుతుందని కూడా తెలిపారు.
2006వ సంవత్సరంలోనే తాను రాజమౌళిని కలిసి సినిమా చేద్దామని అనుకున్నాము.. అయితే ఆయన మర్యాద రామన్న సినిమా ను చేశారు. కానీ తాను పెద్ద సినిమా చేయాలని చెప్పడంతో తాను రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని తర్వాత తప్పకుండా చేద్దామని చెప్పారు.చెప్పిన విధంగానే ఈ సినిమా చేశారని కూడా దానయ్య తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము.అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయిందని దానయ్య తెలిపారు.ఇక నాటు నాటు పాట గురించి మాట్లాడుతూ 30 రోజులు రిహార్సల్స్ చేసి 17 రోజులపాటు ఉక్రెయిన్ లో ఈ పాట షూటింగ్ చేశామని కూడా దానయ్య తెలిపారు. ఈ పాట కోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడ్డారని ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలమే ఆస్కార్ అని ఆయన తెలిపారు. ఇక ఆస్కార్ అవార్డు వచ్చిన వెంటనే రాజమౌళితో మాట్లాడాలని నేను ప్రయత్నం చేశాను కానీ ఆయన అక్కడ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉండటం వల్ల తనకు మాట్లాడటం కుదరలేదని ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు విషయంపై దానయ్య స్పందించారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: