"ఎస్ఎస్ఎంబి 28" మూవీలో శ్రీ లీల పాత్రకు సంబంధించి అదిరిపోయే అప్డేట్..?

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమా అవకాశాలతో కెరీర్ ను అద్భుతమైన జోష్ లి ముందుకు సాగిస్తున్న యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి సందD మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.

అందులో భాగంగా ఈ మోస్ట్ క్రేజీ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ రూపొందుతుంది. ఈ సినిమాకు టైటిల్ ను ఇప్పటి వరకు ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ చిత్రీకరిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో శ్రీ లీల తో పాటు పూజా హెగ్డే కూడా హీరోయిన్ గ నటిస్తోంది.

ఈ ఇద్దరు పాత్రలు కూడా చాలా బాగా వస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ లో శ్రీ లీల పాత్రకు సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం ఈ మూవీ లో శ్రీ లీల పాత్ర ధమాకా మూవీ కంటే పది రెట్లు హైలైట్ గా ఉండనున్నట్లు ... అలాగే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అతడు మూవీ లో త్రిష చేసిన పూరి పాత్ర కంటే రెండు రెట్లు అధికంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇలా మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో శ్రీ లీల పాత్ర అదిరిపోయే రేంజ్ లో ఉండనున్నట్లు వార్తలు వస్తుండడంతో ఈ మూవీ లోని శ్రీ లీల పాత్ర పై ప్రేక్షకుల్లో అప్పుటి నుండే అంచనాలు పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: