మాట మార్చి మనసు మార్చుకున్న మాళవిక నాయర్ !

Seetha Sailaja
సాయి పల్లవి తరువాత నటించే సినిమాలలో హాట్ సీన్స్ ఉంటే నో చెప్పే హీరోయిన్స్ లిస్టులో మళయాళ బ్యూటీ మాళవిక నాయర్ ప్రధమ స్థానంలో ఉంటుంది. దీనికితోడు ఆమె పెద్దగా కమర్షియల్ సినిమాలలో నటించాలి అన్న ఆశక్తి కూడ కనపరచదు. అయితే పోటీ వాతావరణంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడు ఈమె కూడా తన రూట్ ను మార్చుకుంది.

ఈవారం విడుదలకాబోతున్న ‘పలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలో ఈమె నాగశౌర్య పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈమూవీలో కొన్ని లిప్ లాక్ సీన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అలాంటి సీన్స్ కు చాలదూరంగా ఉండే మాళవిక నాయర్ ఇలాంటి రొమాంటిక్ సీన్స్ లో ఎలా నటించింది అంటు కొందరు ఆశ్చర్య పోతున్నారు.

ఇప్పుడు ఈవిశాయాల పై ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. కథ డిమాండ్ చేసి ఆసినిమాలో పాత్రల స్వభావం రీత్యా లిప్ లాక్ సీన్స్ అవసరం అనుకుంటే అలాంటి సీన్స్ లో నటించడం తప్పుకాదు అంటు తన అభిప్రాయాన్ని తెలియచేసి తాను కమర్షియల్ సినిమాలకు రెడీ అంటూ సంకేతాలు ఇస్తోంది. వాస్తవానికి ఈమూవీ సక్సస్ నాగశౌర్య కు చాల అవసరం కావడంతో ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కొన్ని ఘాటు రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది.

ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘డెవిల్’ మూవీలో కూడ ఈమె హీరోయిన్ గా నటిస్తూ గ్లామర్ షోకు ఓకె చేసినట్లు సమాచారం. ఒకవైపు శ్రీలీల మ్యానియా రోజురోజుకు పెరిగిపోతూ ఉండటంతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా నిలబడాలి అంటే అన్ని రకాల పాత్రలలో నటించి గ్లామర్ షోకు ఓకె చెప్పవలసిన పరిస్థితులు చాలామంది యంగ్ హీరోయిన్స్ కు ఏర్పడుతోంది. ఇలాంటి సీన్స్ కు చాల దూరం ఉన్న కీర్తి సురేష్ కూడ మనసు మార్చుకుంది. ఇప్పుడు ఈలిస్టులోకి మాళవిక నాయర్ కూడ చేరిపోయింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: