' ఆవారా' సినిమా అసలు చేయాల్సింది ఆ స్టార్ హీరోనా.....?

murali krishna
కోలీవుడ్ స్టార్ హీరో ఐనా కార్తీ మన తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. ఆయన లింగుసామి  డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఆవారా ఈ సినిమా అప్పట్లో తెలుగులోనూ, తమిళంలోనూ సూపర్ హిట్ అయింది అనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో లింగు సామి టైపు యాక్షన్ ఉంటూనే మ్యూజికల్ గా కూడా ఈ సినిమా అప్పట్లో ఒక సంచలాన్ని సృష్టించిందనే చెప్పాలి.ఈ సినిమా కార్తీ కెరియర్ లోనే అప్పుడు ఒక మంచి హిట్ సినిమాగా నిలిచింది.అయితే ఈ సినిమా తెలుగులో డబ్ చేయకుండా ఇక్కడి హీరో ని పెట్టి తెలుగులో రీమేక్ చేద్దాం అని లింగుసామి అనుకున్నప్పటికీ అది కుదరలేదు.
ఈ సినిమాని రీమేక్ చేయడానికి లింగుసామి మొదటగా హీరో రవితేజ ని అడిగాడట కానీ అప్పటికే రవితేజ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉండటం వల్ల ఈ సినిమా చేయడం కుదరలేదు.
నిజంగా ఈ సినిమా రవితేజ తీసి ఉంటె ఇంకా సూపర్ గా ఉండేది అని కొంతమంది అంటుంటే కార్తీ ఫ్యాన్స్ మాత్రం కార్తీ నే ఈ సినిమా కి బాగా సెట్ అయ్యారు అని అంటున్నారు.అయితే లింగుసామి ఈ సినిమాకి ముందు చేసిన పందెం కోడి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా విషయం మనకు తెలిసిందే.దాంతోనే లింగుసామి కి ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది కానీ ఆయన అప్పుడు తెలుగు లో స్ట్రెయిట్ సినిమా చేయలేదు రీసెంట్ గా రామ్ తో చేసిన వారియర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.ఇక ప్రస్తుతం మళ్లి ఒక తెలుగు హీరోని పెట్టి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తీసే ఉద్దేశ్యం లో ఉన్నట్టు తెలుస్తుంది.అయితే లింగు సామి ఇప్పుడున్న పొజిషన్ లో ఆయనకి పెద్ద హీరోలైతే ఛాన్స్ ఇవ్వరు కాబట్టి ఇక చిన్న హీరోలతో సినిమా చేసే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి.
ఐతే ఆ మూవీ రవితేజ చేస్తే ఇంకో రేంజ్ లో ఉండేదని సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు అంటున్నారు. ఐతే కార్తీ గారు కూడా సినిమా లో ఒక రేంజ్లో చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: