ఎన్టీఆర్ హీరోయిన్ సూసైడ్ నోట్.. వైరల్?

Purushottham Vinay
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ప్రయాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ పాయల్ ఘోష్. కానీ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ తర్వాత మిస్టర్ రాస్కెల్ సినిమాలో కనిపించింది.అయితే అందం, అభినయం వున్నా కూడా తెలుగులో మాత్రం ఈమె అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది పాయల్. హిందీలో పటేల్ కీ పంజాబీ షాదీ సినిమాతో బీటౌన్ లోకి అడుగుపెట్టింది. అయితే అక్కడ కూడా అనుకున్నంత ఆఫర్స్ ని ఈ హీరోయిన్ అందుకోలేకపోయింది. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే పాయల్‏కు ఫేవరేట్ హీరో. తారక్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై సంతోషం వ్యక్తం చేసింది పాయల్.జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతారని 2020 వ సంవత్సరంలోనే చెప్పాను.


ఆస్కార్ విషయాన్ని ముందే అంచనా వేశాను. అసలు నేనెప్పుడూ అబద్ధం చెప్పను అంటూ పోస్ట్ చేసింది పాయల్. ఇంకా అంతేకాదు తారక్ గురించి ఏ మంచి వార్త వచ్చిన ఆయన్ని ఆకాశనికి ఎత్తేస్తూ పోస్టులు పెడుతుంది పాయల్.ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీ సూసైడ్ నోట్ నెట్టింట వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే తన సూసైడ్ నోట్ ని మాత్రం పాయల్ ఘోష్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం షాకింగ్ గా వుంది. 'ఒకవేళ నాకు గుండెపోటు వచ్చి చచ్చిపోయినా.. లేదా నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయిన అందుకు కారణం ఎవరంటే.. ' అంటూ సగం రాసి ఉన్న పేజిని తన ఇన్ స్టాలో షేర్ చేసింది పాయల్ ఘోష్. ఇది చూసిన ఆమె అభిమానులు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగిందంటూ ఆమె పోస్ట్ కి కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: