నాని దసరా టీజర్ హిందీ ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదా...?

murali krishna
నాని నటించిన దసరా సినిమా మార్చి 30 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు లోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడం భాషల్లో కూడా ఈ సినిమా ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ఇటీవల సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషల్లో కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు సినిమా పై ఆసక్తి పెంచేందుకు  తెగ ప్రయత్నించారు. తెలుగు ప్రేక్షకుల్లో దసరా సినిమా పై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. కానీ ఇతర భాషల్లో మాత్రం దసరా సినిమా కి పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా హిందీ లో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టాలి అంటే ఓపెనింగ్స్ కూడా ఎక్కువగా ఉండాలి.. అందుకు కాస్త ఎక్కువగా ఖర్చు చేసి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా తో పాటు జాతీయ మీడియా లో దసరా సినిమా గురించి ప్రమోషన్ జరిగితేనే హిందీ ప్రేక్షకులు ఈ సినిమా పై ఆసక్తి చూపుతారు.. అలా కాదని ప్రమోషన్ విషయం లో లైట్ తీసుకుంటే కనుక కచ్చితంగా నష్టం భారీగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దసరా సినిమా భారీ అంచనాల నడుమ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో రూపొందిన సంగతి తెలిసిందే ఈ సినిమా లో నాని కి జోడి గా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సినిమా లో కీర్తి సురేష్ నటన పతాక స్థాయిలో ఉంటుందని అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆశిస్తున్నారు. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సినిమా ఉంటుందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడటా.నాని ఈ మధ్య పలు సందర్భాల్లో సినిమా గురించి మాట్లాడుతూ ఈ ఏడాది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే సినిమాగా దసరా నిలుస్తుందనే తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: