అవకాశాలు లేక కాఫీ స్టూడియో పెట్టుకున్న నటి.....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీ నుండి మాయం ఇపోయే నటి నటులు చాలా మంది ఉంటారు. అలా వెళ్లిన వారిలో ఒక నటి రిచా పనయ్ గురించి కొంత మందికి మాత్రమే తెలుసు. ఆమె మొదట అల్లరి నరేష్ హీరోగా నటించిన యముడికి మొగుడు మూవీతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
ఐతే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు రాలేదు.చందమామ కథలు, రక్షక భటుడు లాంటి సినిమాలలో నటించినా కూడా ఆమెకు తగిన గుర్తింపు దక్కాలేదు. అవకాశాలు లేకపోవడంతో నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. ఐతే లాక్ డౌన్ టైంలో కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ కనుమరుగైపోవడం మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించలేదు. ఇది ఇలా ఉంటే రిచా పనయ్ తాజాగా హైదరాబాదులో మెరిసింది.
ఐతే ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా లాక్డౌన్లో నేను రెండు సినిమాలు చేశాను. అవి ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురు చూస్తున్నాను. అందులో ఒకటి శ్రీధర్ సీపానగారి డైరెక్షన్ లో తెరకెక్కిన బృందావనమది అందరిది సినిమా కాగా, రెండోది నీలకంఠ గారి డైరెక్షన్ లో తెరకెక్కింది. అవి విడుదలైన తర్వాత నాకు మంచి అవకాశాలు వస్తాయని నేను భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది రిచా పనయ్. షూటింగ్ అప్పటి రోజులను మిస్ అవుతున్నాను. ఐతే ఆ రోజులు నాకు ఎంతో ఎపుడు గుర్తుండి పోయే రోజులు. కాని సినిమా అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని భావించలేం.అందుకే ప్లాన్ బి కూడా రెడీ చేసుకున్నాను. క్యాట్ కాఫీ స్టూడియోని స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ చూసుకుంటున్నాను. నా ఫోకస్ అంతా దానిపైనే ఉంది. అయితే మంచి అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను. మంచి అవకాశాల కోసం వేచి చూస్తున్నాను చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం విషయం గురించి మాట్లాడుతూ ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ప్రస్తుతం అంత యాక్టివ్గా ఉండటం లేదు. అందులో నెగిటివిటి బాగా పెరిగిపోయింది. నేను కామెంట్స్ పెద్దగా చూడను, చదవను. ఏదైనా బ్యాడ్ కామెంట్ ఉంటే డిలీట్ అయ్యేలా సెట్టింగ్స్ ఉంటే బాగుంటుంది.
ఐతే ఆమె చేసిన ఒకటి రెండు సినిమాలు ఐనా పర్లేదు అని పించేలా ఉన్నాయని ఆమె పెట్టిన పోస్ట్ కి నేటిజన్లు సమాధానం ఇస్తున్నారు. ఆమెకు ముందు ముందు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: