హిందీలో కూడా "దసరా" మూవీపై సూపర్ క్రేజ్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ లో నాని కి సంబంధించిన ఊర మాస్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తో ఈ దర్శకుడు దర్శకుడుగా తన కెరియర్ ను ప్రారంభించబోతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందించారు.

ఈ సినిమాను మార్చి 30 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , కన్నడ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తెలుగు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం చాలా సహజమే ... కానీ ఆ తర్వాత ఈ సినిమా  హిందీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఈ మూవీ హిందీ ట్రైలర్ కు ప్రేక్షకుల్లో నుండి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే ఈ మూవీ కి బాలీవుడ్ నుండి మంచి టాక్ వచ్చినట్లు అయితే సూపర్ కలెక్షన్ లు హిందీ పరిశ్రమ నుండి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది.ఇలా ఉంటే నాని నటించిన మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: