"ఓజి" విడుదలపై క్రేజీ న్యూస్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడి గా ఒకరిగా పేరు తెచ్చుకున్న సుజిత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే రన్ రాజా రన్ ... సాహో మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకుడి గా తన కంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే సాహో మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఈ యువ దర్శకుడు కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ తో "ఓజి" అనే మూవీ ని రూపొందించ బోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ దర్శకుడు ఫుల్ బిజీ గా ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయినట్లు ... ఏప్రిల్ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సుజిత్ ఈ మూవీ ని ముంబై బేస్డ్ గ్యాంగ్ స్టార్  డ్రామా గా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ చాలా తక్కువ రోజులను కేటాయించనున్నట్లు ... ఆ రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకునే విధంగా ఈ చిత్ర బృందం ప్రణాళికలను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ విడుదలకు సంబంధించిన ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు అందుకు అనుగుణంగా ఈ మూవీ యొక్క షూటింగ్ ను పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే విధంగా ఈ చిత్ర బృందం ప్లాన్స్ చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: