అయ్య బాబోయ్.. చరణ్ కి ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కొంతమందిలో అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు అని చెప్పాలి. ఒకప్పటి టాలీవుడ్ నెంబర్వన్ హీరో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా వచ్చి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు  అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక అంతర్జాతీయ వేదికలపై ఇటీవలే రామ్ చరణ్ చేసిన సందడి అంత ఇంత కాదు అని చెప్పాలి.

 ఇక ఇటీవలే త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి అటు ఆస్కార్ అవార్డు రావడంతో ఇక ఇప్పుడు ప్రస్తుతం సినీ ప్రపంచం మొత్తం రామ్ చరణ్ గురించి అతని లగ్జరీ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పాలి. కాగా 2006లో పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఇంటర్వ్యూ ఇచ్చిన మొదటి సినిమాతోనే హిట్టు కొట్టాడు. ఆ తర్వాత మగధీరతో బాక్సాఫీస్ రికార్డులు అన్నీ కూడా బద్దలు కొట్టేశాడు. తన తండ్రి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో నిర్మాతగా కూడా మారాడు అని చెప్పాలి.

 ఇప్పుడు ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను నిర్మిస్తున్నాడు.  వ్యాపారాలు ఒకవైపు మరోవైపు హాస్పిటల్స్ ఇంకోవైపు విమానయాన వ్యాపారం ఇక ఇవన్నీ చాలవు ఉన్నట్లు వాణిజ్య ప్రకటనలు.. ఇలా గట్టిగానే సంపాదిస్తున్నాడు రామ్ చరణ్. ఏకంగా ప్రస్తుతం 34 బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నాడు అని చెప్పాలి.  ఇక ఒక్కో బ్రాండ్ కి ప్రమోషన్ కోసం కోట్లలోనే రెమినరేషన్ తీసుకుంటూ ఉంటాడు. అయితే చిరంజీవి నుంచి వచ్చిన ఆస్తులు కాకుండా చరణ్ వ్యక్తిగతంగా సంపాదించిన ఆస్తులు చాలా ఉన్నాయట.

 చరణ్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు విలువ దాదాపు 1500 కోట్ల వరకు ఉంటుందని టాక్ ఉంది. ఇక చరణ్ కొత్తగా కట్టుకున్న ఇంటి విలువ 100 కోట్ల వరకు ఉంటుంది. ఇక ప్రతి నెల చరణ్ సంపాదన నాలుగు కోట్లకు పైగానే ఉంటుందట. ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో తన పాత్ర కోసం 45 కోట్ల పారితోషకం  తీసుకున్నాడు. మనదేశంలో ఎక్కువ టాక్స్ చెల్లిస్తున్న వారిలో చరణ్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి హైయెస్ట్ టాక్స్ పే చేసే హీరోలలో చరణ్ ముందు వరుసలో ఉన్నాడట. హైదరాబాద్లోనే కాదు ముంబైలో కూడా ఒక పెద్ద ఇల్లును కొన్నాడట చరణ్. ఇక మెర్సడిస్  బెంజ్,  రోల్స్ రాయిస్, పాంటం. రేంజ్ రోవర్ ఆస్తిన్ మార్టిన్, ఫెరారీ లాంటి కార్లు కూడా ఉన్నాయి. చరణ్ కి  సొంతంగా ప్రైవేట్ జట్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: