బాలకృష్ణ వారసుడి సినీ ఎంట్రీ పై లేటెస్ట్ న్యూస్..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించిన బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే గత కొంత కాలం వరుస అపజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న బాలకృష్ణ వరుసగా అఖండ ... వీర సిం హారెడ్డి లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాలతో ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తన కుమారుడు అయినటువంటి మోక్షజ్ఞ ను కూడా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇప్పించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా కాలం నుండి బాలకృష్ణ అభిమానులు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొంత కాలం క్రితం బాలకృష్ణ కూడా తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని ప్రకటించారు. అయితే ఆ మూవీ కి దర్శకుడు ఎవరనేది బాలకృష్ణ అప్పుడు ప్రకటించలేదు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి దర్శకత్వం వహించబోయేది పలానా దర్శకుడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తో మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత అనిల్ ... మోక్షజ్ఞ కాంబినేషన్ లో మూవీ ప్రారంభం కాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: