అల్లుఅర్జున్-స్నేహారెడ్డి పెళ్ళికి వద్దని అడ్డుచెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ వైఫ్స్ లో అల్లు స్నేహారెడ్డి ఒకరు. హీరో అల్లు అర్జున్ అర్ధాంగిని ఇంస్టాగ్రామ్ లో ఏకంగా ఎనిమిది మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు.ఐతే దీన్ని  బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె రేంజ్ ఏమిటో. హీరోయిన్స్ మాదిరి స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తుంటారు. బన్నీ భార్యగానే కాకుండా ఆమెకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు.
స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండే స్నేహారెడ్డి తన గ్లామర్ రహస్యం బయటపెట్టారు. ఇంస్టాగ్రామ్ వీడియో తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. వ్యాయామం, యోగ, మంచి ఆహారంతో పాటు కుటుంబం, ప్రకృతితో గడపడం తాను ఆనందకర జీవనం సాగించేలా చేస్తున్నాయని స్నేహారెడ్డి తెలిపారు. ఆనందంగా ఉంటే ఆరోగ్యం, అందం ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కాబట్టి క్రమశిక్షణతో కూడిన ప్రశాంత జీవనమే తన గ్లామర్ సీక్రెట్ అని స్నేహారెడ్డి చెప్పకనే చెప్పారు.
అలాగే స్నేహారెడ్డికి మొక్కలు అంటే ప్రాణం. తన ఇంట్లో పెద్ద నర్సరీని మైంటైన్ చేస్తున్నారు. మొక్కల పోషణ చూసుకోవడం, వాటి మధ్య గడపడాన్ని అమితంగా ఇష్టపడతారు. ఇటీవల నర్సరీలో మొక్కల మధ్య ఆహ్లాదంగా గడుపుతున్న వీడియో షేర్ చేశారు. 'మన చుట్టూ మొక్కలు ఉంటే.. అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి. వాటిని చూస్తే ప్రేమలో పడిపోతాం. వాటి పోషణ చూసుకోవడం ఆహ్లాదం కలిగిస్తుంది. అందుకే నాకు నర్సరీ అత్యంత ఇష్టమైన ప్రదేశం..' అని కామెంట్ చేసి, మొక్కలంటే తనకు ఎంత ఇష్టమో తెలియజేశారు.
కాగా స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. అయితే స్నేహారెడ్డి ఫాదర్ వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. స్నేహారెడ్డి పట్టుబట్టి అల్లు అర్జున్ తో ఏడడుగులు వేశారట. 2011 మార్చ్ 6న వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు అయాన్, అమ్మాయి అర్హ. శాకుంతలం మూవీతో అర్హ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమవుతున్నారు. ఆమె బాలనటిగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: