ఉపాసన నక్లేస్ గూర్చి రామ్ చరణ్ స్పందన....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పేరు అమెరికా లోని లాస్ ఏంజెల్స్ లో ఉన్నా డాల్బి థియేటర్లో మారుమోగేలా చేయడానికి ఆర్ఆర్ఆర్ టీం అక్కడే సందడి చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే.ఐతే దాంట్లో భాగంగానే రామ్ చరణ్ కూడా గత కొంత రోజులుగా అమెరికాలోనే ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఈయన అమెరికాలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
ఇలా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉండిపోయారు. ఇక నేడు ఆస్కార్ వేడుకలలో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ అవార్డు వేడుకలలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు.ఇక ఈ ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా పాల్గొన్నారు.
ఈ వేడుకలలో ఉపాసన సాంప్రదాయ బద్ధంగా చీర ధరించి సందడి చేశారు. ఇలా చీరకట్టులో ఉపాసన ఎంతో అందంగా ఉన్నారు. ఇక ఈ వేడుకలలో భాగంగా ఉపాసన ధరించిన నక్లెస్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ క్రమంలోనే ఈ వేడుకల అనంతరం మీడియా ప్రతినిధి రామ్ చరణ్ ఉపాసన దంపతులతో మాట్లాడుతూ తన నక్లెస్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆస్కార్ వేడుకల అనంతరం మీడియా ప్రతినిధితో రామ్ చరణ్ మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు అందుకోవడం పట్లా సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి నర్వెస్గా అనిపించడం లేదని ఒక నటుడిగా కాకుండా ఒక ఫ్యాన్ బాయ్ గా తనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని తెలిపారు. ఇక మీడియా ప్రతినిధి ఉపాసనని ప్రశ్నించడంతో నర్వెస్గానే ఉందని ఈమె తెలియజేశారు. అనంతరం మీడియా ప్రతినిధి ఉపాసన ధరించిన నెక్లెస్ గురించి మాట్లాడుతూ నాలుగు వందల రూబీస్ విలువ కలిగిన నెక్లెస్ ధరించారు అంటూ మాట్లాడటంతో వెంటనే రాంచరణ్ స్పందిస్తూ ఇప్పుడు నాకు నర్వెస్గా అనిపిస్తుంది.. నా భార్యను చూసుకోవాలి.తను వేసుకున్న ఆ నెక్లెస్ను చూసుకుకోవాలి అంటూ ఫన్నీగా సెటైర్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏదేమైనా రాంచరణ్ జంట అక్కడ చాలా చూడ ముచ్చటగా ఉందని మన తెలుగు ప్రజలు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: