"సూర్య 42" మూవీ టైటిల్ గ్లిమ్స్ విడుదల ఆ తేదీనే..?

Pulgam Srinivas
కెరియర్ లో ఇప్పటికే ఎన్నో వైదిధ్యమైన పాత్రలలో నటించి నటుడిగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటికే ఎన్నో తమిళ సినిమా లలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తమిళ్ లో రూపొందిన గజిని మూవీ ని తెలుగు లో విడుదల చేసి సూర్య ఈ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత నుండి సూర్య నటించిన దాదాపు ప్రతి మూవీ ని తెలుగు లో విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అదిరిపోయే రేంజ్ మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తమిళ్ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ మూవీ సూర్య కెరియర్ లో 42 వ మూవీ గా రూపొందుతుంది  ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే 500 కోట్లకు పైగా బిజినెస్ ఆఫర్ లు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ భారీ క్రేజ్ ఉన్న సినిమాకు సంబంధించిన గిమ్స్ వీడియోను మార్చి14 తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: