కోసి కారం పెడతా అంటున్న కాజల్...!!

murali krishna
కాజల్ అగర్వాల్  మూడు పదుల వయసులోనూ అలాగే పెళ్లి అయి బిడ్డకు జన్మనిచ్చినా తన అందం మాత్రం అస్సలు తగ్గడం లేదని చెప్పాలి.. రోజురోజుకూ తన అందం కూడా పెరుగుతోంది.
లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చందమామ తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థాయి కి ఎదిగింది. స్టార్ హీరోల సరసన నటించి బెస్ట్ హీరోయిన్ అని అనిపించుకుంది. లక్ష్మీ కళ్యాణం సినిమా దగ్గర్నుంచి ఇప్పటి వరకు తన ఫిజిక్ లో ఏ మాత్రం మార్పు రాలేదు. అలాగే మెయిన్ టెన్ చేస్తూ అందరికి పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
టాలీవుడ్ మాత్రమే కాదు.. తమిళం మరియు హిందీ ఇండస్ట్రీలో కూడా ఈ ముద్దుగుమ్మ బాగా రాణించింది. తన ఖాతాలో పలు హిట్ సినిమాలను వేసుకొని సక్సెస్ హీరోయిన్ అనే ముద్ర ను వేయించుకుంది. అసలు తనలోని అందాన్ని వెలికితీసింది మాత్రం పూరీ జగన్నాథ్. బిజినెస్ మ్యాన్ సినిమాలో తను ఎంత గ్లామర్ ఒలకబోసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటి వరకు కాజల్ ఏ హీరోకు లిప్ కిస్ను అయితే ఇవ్వలేదు కానీ.. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేశ్ బాబుకు రెండు లిప్ కిస్ లు ఇచ్చిందట కాజల్. కాజల్ అగర్వాల్.. తన డైలాగ్స్ ను బట్టీ పట్టి మరీ షూటింగ్ లో చెప్పుకొచ్చేదట.. ఏ సినిమా అయినా అంతే చేసేదట.
తను కొంచెం కోపంగా డైలాగ్ చెప్పాల్సి వస్తే కనుక నిజంగానే కోపం తెచ్చుకొని మరి ఆ డైలాగ్స్ చెప్పేదట. బిజినెస్ మ్యాన్ సినిమాలో కోసి కారం పెడతా నా కొడకా అనే డైలాగ్ ను కాజల్ చెప్పాల్సి వుంది.. పూరీ చెప్పగానే.. అదే రేంజ్ లో కోపంతో ఆ డైలాగ్ ను పూరీని చూస్తూ కోపంతో చెప్పేసిందట కాజల్. దీంతో అక్కడున్న వాళ్లంతా కూడా షాక్ అయ్యారట. అది తెలుగు బూతు అని తెలిసినా కూడా తెలుగు రాకున్నా ఎంత ఘాటుగా ఆ డైలాగ్ ను కాజల్ చెప్పిందో అని అప్పట్లో ఇండస్ట్రీ గుసగుసలు వినిపించాయి.. అయితే.. ఎడిటింగ్ లో ఆ డైలాగ్ మాత్రం లేకుండా పోయింది. ఆ డైలాగ్ వల్ల మహేశ్ ఫ్యాన్స్ ఎక్కడ బాధపడతారో అని ఆ డైలాగ్ ను తీసేశారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: