పవర్ స్టార్ 27 ఏళ్ల ప్రస్థానంలో గుర్తుండిపోయే మూవీలు?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా తన ముద్ర వేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు అంటే ప్రస్తుతం ఒక బ్రాండ్. టాలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా క్రేజ్ వున్న టాప్ స్టార్స్ లో ఒకడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు.చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ ని తమ ఐకాన్ గా భావిస్తూ ఉంటారు. పవన్ నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వంతో ఆయన తమ్ముడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమాతోనే ఏకంగా సూపర్ హిట్ కొట్టాడు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో ఏకంగా చేతిపై నుంచి కార్లు ఎక్కించుకొని ఎవరూ చేయని సాహసం చేసి అందరిని ఆకట్టుకున్నాడు.ఇక తమ్ముడు సినిమాలో అయితే నిజమైన బాక్సర్ లాగానే ప్రాక్టీస్ చేయడంతో పాటు గుండెల మీద రాళ్ళు బద్దలు కొట్టించుకొని ఇంకా బాగా ఆకట్టుకున్నాడు. ఆ గూజ్ బంప్ విజువల్స్ ని ఇప్పటికి కూడా ఎవరూ మరిచిపోరు. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పాలి. ఇక యూత్ లో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచిన సినిమాలు వున్నాయి. అందులో మొదటగా చూసుకుంటే బద్రీ మూవీలో బద్రీ పాత్ర గురించి చెప్పాలి.ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ తో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ కి ఆడియన్స్ నుంచి విజిల్స్ పడ్డాయని చెప్పాలి.


అంతలా ఆ మూవీ యూత్ ని మెప్పించింది. తరువాత తమ్ముడు సినిమాలో సుబ్బు పాత్రకి కూడా అప్పటి యూత్ చాలా విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. అమ్మాయిల వెంట తిరిగే ఓ ఆవారాగాడు అన్న కోసం బాద్యతగా బాక్సింగ్ నేర్చుకొని రింగ్ లో తన ప్రత్యర్ధిని ఓడించడం అనే పాయింట్ అప్పట్లో అందరికి చాలా బాగా నచ్చింది. ఇక సుబ్బు పాత్ర ట్రావెలింగ్ సోల్జర్ అనే పాటలో చేసే విన్యాసాలు ఇప్పటికి టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి.ఆ పాటని ఇప్పుడు కూడా పవర్ స్టార్ యాంతం లాగా ఆయన ఫ్యాన్స్ భావిస్తారు.ఆ తరువాత ఖుషి మూవీలో సిద్దు పాత్రకి కి అయితే యూత్ పూర్తిగా అడిక్ట్ అయిపోయారు అని చెప్పాలి. ఖుషి మేనియా ఇప్పటికి కొనసాగుతుంది. ఇక ఖుషి మూవీ వల్ల పవన్ కళ్యాణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. తరువాత చాలా సినిమాలు ఫ్లాప్ అయిన కూడా ఖుషి బ్రాండ్ తో పవన్ గట్టిగానే నీలదొక్కుకున్నాడు. మళ్ళీ గబ్బర్ సింగ్ లో గబ్బర్ సింగ్ పాత్రకి కూడా ఆ స్థాయిలో ఫ్యాన్స్ యూత్ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా పిచ్చి అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: