ఆ ఒక్క సిరీస్ తో చెడిపోయిన వెంకటేష్ ఇమేజ్...!!

murali krishna
తెలుగు లో ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అంటే మనకి వెంటనే విక్టరీ వెంకటేష్ పేరు తప్ప మరో హీరో పేరు అయితే వినిపించదు.ఆయన సినిమా కి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టేస్తారు.అరవై ఏళ్ల వయస్సులో కూడా ఆయనకీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయంటే దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అనే చెప్పవచ్చు.
మారుతున్న ట్రెండ్ ప్రకారం డబుల్ మీనింగ్ వచ్చే డైలాగ్స్ చెప్పడం అలాగే అసభ్యకరమైన మాటలు వంటి వాటి జోలికి వెళ్ళేవాడు కాదు..కానీ రీసెంట్ గా విడుదలైన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ చూస్తే, నలభై ఏళ్ల నుండి ఆయన సంపాదించుకున్న మంచి పేరు కాస్త చెడిపోయింది అనే భావన కలుగుతుంది. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడం కూడా ప్రారంభించింది.
వెంకటేష్ తో పాటుగా ఆయన అబ్బాయి రానా దగ్గుపాటి కూడా ఈ సిరీస్ లో మరో హీరో గా అయితే నటించాడు.ఈ సిరీస్ విడుదలకు ముందు గానే వెంకటేష్ మరియు రానా ఫ్యామిలీ తో కూర్చొని అస్సలు చూడొద్దు, ఇది అలాంటి సినిమా కాదు అని కూడా చెప్తూనే ఉన్నారు.కానీ వాళ్ళు ఎంత చెప్పినా అది వెంకటేష్ ఉన్న సిరీస్ కనుక ఆయనకీ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వల్ల వాళ్ళు కచ్చితంగా చూస్తారు.అలా చూస్తే మాత్రం అడ్డం గా బుక్ అయ్యినట్టే అని చెప్పాలి ఎందుకంటే మొదటి ఎపిసోడ్ ప్రారంభం పది నిమిషాల్లోనే బూతుల పురాణం అలాగే సెక్స్ సన్నివేశాల తోనే ప్రారంభం అవుతుందటా..అలా ప్రతీ పది నిమిషాలకు ఒక బూతు ఉండడం విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరో నోటి నుండి రావడం తట్టుకోలేకపోతున్నారు అభిమానులు.
ఇలాంటి అడల్ట్ కంటెంట్ కి యూత్ బాగా కనెక్ట్ అవుతారు...కానీ ఈ సిరీస్ చూస్తే మాత్రం వాళ్ళు కూడా తిట్టుకునే రేంజ్ లో ఉంటుంది.ఇక ఈ సిరీస్ కి ఇప్పటి వరకు 1 మిలియన్ వ్యూస్ కూడా రాలేదని తెలుస్తుంది.చిన్న సినిమాలు సైతం రెండు మిలియన్ వ్యూస్ ని ఈజీ గా సొంతం చేసుకుంటుంటే వెంకటేష్ లాంటి హీరో కి ఇంత తక్కువ రావడం ఓటీటీ హిస్టరీ లోనే మొదటిసారి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: