హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ స్టార్ నటి కూతురు....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన అందం, అభినయంతో 90వ దశకంలో దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది గౌతమి. ఆమె తెలుగుతో పాటు తమిళ్‌, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో లు చేసి మెప్పించింది.
ఐతే ఆమె తెలుగులో చేసిన సినిమాలలో బామ్మమాట బంగారు మూట, చైతన్య, అన్నా, పల్లెటూరి, శ్రీ వెంకటేశ్వర కల్యాణం, చిలక్కొట్టుడు, ద్రోహి తదితర తెలుగులు గౌతమికి మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే తన అభినయ ప్రతిభకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం చేతుల మీదుగా పలు పురస్కారాలు తీసుకుంది. కాగా స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే వ్యాపార వేత్త సందీప్‌ భాటియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాదిలో వీరికి ఓ కూతురు జన్మించింది. ఆమెకి సుబ్బలక్ష్మి అనే పేరు పెట్టారు. అయితే ఆ వెంటనే భార్యాభర్తలు విడిపోయారు. దీంతో సింగిల్‌ మదర్‌గానే సుబ్బలక్ష్మిని పెంచి పోషించింది గౌతమి. ఇక ఉన్నత చదువులు చదివిన సుబ్బలక్ష్మి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. ఇవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
కాగా చూడ్డానికి అమ్మలాగానే ఉన్న సుబ్బలక్ష్మి అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు. తన ఫొటోల్లో కూడా ఎక్కడ గ్లామర్‌ షో చేయకపోవడం ఈ అమ్మడి స్టైల్‌. అందుకే సుబ్బలక్ష్మి ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. చూడడానికి మాధురీ దీక్షిత్‌లా ఉందని, ఇంకొందరు నటి సుకన్యలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. సుబ్బలక్ష్మి హీరోయిన్‌ అయితే మంచి భవిష్యత్‌ ఉందంటున్నారు. కాగా గౌతమి కూతురు ల్లోకి వస్తుందని గతంలో కూడా చాలా వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడు మళ్లీ ఆమె ఫొటోలు నెట్టింట్లో బాగా ట్రెండ్‌ అవుతుండడంతో సుబ్బలక్ష్మి సినీ ప్రస్థానానికి టైం వచ్చిందని అందరు భావిస్తున్నారు.
ఐతే గౌతమీ అభిమానులుగా ఆమెను ఆదరించినట్లుగానే ఆమె కూతురిని కూడా అందరిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: