గొప్ప మనసు చాటుకున్న నమ్రత..!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత మరొకసారి తన భర్తతో కలిసి తమ గొప్ప హృదయాన్ని చాటుకున్నారు ఖలేజా సినిమాలో చూపించినట్టు పేదల పాలిట దేవుడిలా అన్నట్టు ఇప్పుడు సమాజంలో కూడా కష్టం వచ్చినవారికి భార్య భర్తలు ఇద్దరూ తమ వంతు సహాయం చేస్తున్నారు. ఎందరో చిన్నారుల గుండెలను ఆగిపోకుండా కాపాడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి పేద విద్యార్థుల పాలిట భగవంతుడు అయ్యాడు అనడంలో సందేహం లేదు.
మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఆగిపోతున్న చిన్నారుల గుండెలను నిలబెట్టుతున్నాడు మహేష్ బాబు ఇప్పటికే కొన్ని వేల మంది చిన్నారుల జీవితంలో వెలుగులు నింపిన చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీలు చేయిస్తూ ప్రాణాలు కూడా పోస్తున్నారు.. ఇక ఆయన వెన్నంటే నడుస్తూ భర్తకు సహాయం చేస్తూ అన్నింటిలో కూడా భాగం పంచుకుంటుంది. ఒకవైపు ఇంటిని మరొకవైపు పిల్లలను అలాగే మహేష్ బాబు ఎన్నో వ్యాపారాలను ఆమె దగ్గరుండి మరి చూసుకుంటున్నారు. అయితే ఈసారి టాలెంట్ ఉండి చదువుకునే స్తోమత లేని ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.. ఈ క్రమంలోనే ఒక పేద విద్యార్థినికి చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేశారు నమృతా, మహేష్ బాబు.
తాజాగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక విద్యార్థినికి లాప్టాప్ ను బహుమతిగా అందించారు మహేష్ దంపతులు. ఆ విద్యార్థిని ఓవియేషన్ కోర్స్ చదువుతుండడంతో ఫ్యూచర్ స్టడీస్ కి ఉపయోగపడేలా లాప్టాప్ అందించడంతో పాటు చదువు కోసం ఆర్థికంగా కూడా సహాయం చేశారు ఈ దంపతులు కూడా ఇలాగే బాగా చదువుకునే విద్యార్థులకు సహాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. దీంతో లాప్టాప్ అందుకున్న ఆ విద్యార్థిని చాలా సంతోషించింది.. ఆ విద్యార్థి తల్లిదండ్రులు మహేష్ బాబు దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: