తెలంగాణ భాషలో సినిమాలు వస్తే సక్సెసేనా..?

Divya
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా సినిమాలోని భాష కథ చాలా విభిన్నంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నారు. అలా ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ వంటి బ్యాక్ డ్రాప్ లు యాసలతో మాట్లాడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే అలా టాలీవుడ్లో వచ్చిన తెలంగాణ బ్యాక్ డ్రాప్ యాస తో ఆధారంగా నిర్మించిన సినిమాల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీస్ సినిమా నాగచైతన్య సాయి పల్లవి నటీనటులుగా నటించారు ఈ సినిమా కూడా తెలంగాణ యాస బ్యాక్ డ్రాప్ లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

ఇక డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం rrr ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడే స్లాంగ్ తెలంగాణ యాస డ్రాప్ ఆధారంగా తీసినట్టుగా తెలుస్తోంది.
డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రంలో కీలకమైన పాత్రల రవితేజ కూడా నటించారు. ఇందులో రవితేజ మాట్లాడిన మాటలు కూడా తెలంగాణ యాసకు సంబంధించిన మాటలే అన్నట్లుగా తెలుస్తోంది.

ఇక జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి మంచి విజయాన్ని అందుకున్నారు . ఆ చిత్రమే బలగం. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు.
జాతి రత్నాలు సినిమాలో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శని, రాహుల్ రామకృష్ణ, ఫరియా  అబ్దుల్లా ఈ చిత్రంలో ఈ సినిమా కూడా తెలంగాణ యాసలోనే నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వం వహించారు.
ఇక ఇప్పుడు నాని నటిస్తున్న దసరా సినిమా కూడా తెలంగాణ యాసకు సంబంధించిందె అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి మరి నాని నటిస్తున్న ఈ సినిమా కూడా కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: