దసరా మూవీలో ఆ రెండు ఫైట్స్ అదిరిపోయాయట..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ఇప్పటికే ఎన్నో సినిమాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. నాని ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ లలో హీరో గా నటించి ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ... ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో నటించి నటుడి గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే నాని క్రికెట్ నేపథ్యంలో రూపొందిన జెర్సీ అనే వైవిధ్యమైన సినిమాలో నటించి తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ... విమర్శకులను మెప్పించాడు.

పోయిన సంవత్సరం నాని "అంటే సుందరానికి" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం సాధించినప్పటికీ నాని మాత్రం తన నటన తో ప్రేక్షకులను మెప్పించాడు. ఇది ఇలా ఉంటే నాని ప్రస్తుతం దసరా అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తూ ఉండగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , హిందీ , కన్నడ , మలయాళం , తమిళ భాషలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ లో మొత్తం మూడు ఫైట్ లు ఉండనున్నట్లు ... అందులో ఇంటర్వెల్ ఫైట్ మరియు క్లైమాక్స్ ఫైట్ అదిరిపోయే రేంజ్ లో వచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఈ మూవీ ని తెలంగాణ బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందించినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: