ఎన్టీఆర్ 30 కోసం జాహ్నవి కపూర్ అన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందా..?

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి జాహ్నవి కాపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి తనకంటూ హిందీ సినీ పరిశ్రమలో ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇలా హిందీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి  కూడా అదిరిపోయే ఆఫర్ లు గతంలో వచ్చినట్లు అనేక వార్తలు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే గత కొద్ది కాలంగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే ఎన్టీఆర్ 30 వ మూవీ లో జాహ్నవి కపూర్ కు హీరోయిన్  అవకాశం వచ్చినట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ 30 వ మూవీ యూనిట్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా కనిపించబోతుంది అంటూ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. దీనితో జాహ్నవి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎన్టీఆర్ 30 మూవీ తో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అధికారిక అనౌన్స్మెంట్ వచ్చేసింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కోసం జాహ్నవి కపూర్ ఏ రేంజ్ లో రెమ్యూనికేషన్ తీసుకుంటుంది అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగా ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జాహ్నవి కాపూర్ ... ఎన్టీఆర్ 30 వ మూవీ కోసం ఏకంగా 5 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మకు 5 కోట్ల రెమ్యూనిరేషన్ పెద్ద విషయం ఏమీ కాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: