శ్రీలీల స్పీడ్ పై కన్నేసిన జాన్వీ !

Seetha Sailaja
ప్రస్థుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా శ్రీలీల మ్యానియా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 10సినిమాలలో కనీసం 5సినిమాలు హిట్ అయితే చాలు ఆమె తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థానికి చేరుకోవం ఖాయం అన్నసంకేతాలు వస్తున్నాయి. దీనితో ప్రస్తుతం ఈమె యూత్ కు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

శ్రీదేవి కుమార్తిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కు తొలిరోజులలో ఆమె పట్ల విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే ఆమె ఎంచుకున్న కథలు సరిగ్గా లేకపోవడంతో ఆమె నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడంతో పాటు మరికొన్ని సినిమాలు డైరెక్ట్ రిలీజ్ కూడ లేకుండా కేవలం ఓటీటీ కి పరిమితం కావడంతో జాన్వీ కపూర్ మ్యానియా నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో జూనియర్ కొరటాల కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీ ఆఫర్ తనకు రాగానే మరో మాట్లాడకుండా జాన్వీ అంగీకరించింది అంటున్నారు.

వాస్తవానికి బాలీవుడ్ లో జాన్వీ మార్కెట్ ఏమాత్రం బాగాలేదు. దీనికితోడు ఆమెకు అనేకమంది బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ పోటీ కూడ హెచ్చుగా ఉంది. ఆమె నిలబడాలి అంటే దక్షిణాది సినిమా రంగం నుండి ఆమెకు సపోర్ట్ కావాలి ఇప్పుడు ఆసపోర్ట్ జూనియర్ తో నటించబోతున్న మూవీ వల్ల వస్తుందని ఆమె భావించడంతో పారితోషిక విషయంలో ఎటువంటి ఆలోచనా పెట్టుకోకుండా ఆమె ఈఆఫర్ ను ఓకె చేసింది అన్న మాటలు వస్తున్నాయి.

కొరటాల సినిమాలలో హీరోయిన్ కు పాత్ర పరంగా చాల ప్రాధాన్యత ఉంటుంది. కేవలం గ్రామర్ షోలకు మాత్రమే పరిమితం కారు. దీనికితోడు పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తీస్తున్న పరిస్థితులలో ఈమూవీని బాలీవుడ్ లో కూడ భారీ స్థాయిలో ప్రమోట్ చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఒకప్పుడు శ్రీదేవి ఎన్టీఆర్ తో నటించిన ‘వేటగాడు’ సినిమాతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరినట్లుగా ఇప్పుడు జాన్వీ కపూర్ కు జూనియర్ సినిమా అలాంటి అదృష్టాన్ని కలిగించే ఆస్కారం ఉంది. అదే జరిగితే జాన్వీ శ్రీలీల మ్యానియాకు కొంతవరకు చెక్ పెట్టే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: