కాపురానికి పనికిరాకుండా చేస్తా.. రాకింగ్ రాకేష్ కి వార్నింగ్?

praveen
తెలుగు బుల్లితెరపై  మంచి గుర్తింపు సంపాదించుకున్న లేడీ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు అని చెప్పాలి. పటాస్ అనే కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైన శ్రీముఖి.. తన చలాకీ తనంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక శ్రీముఖి ఏ షో  యాంకరింగ్  చేసిన కూడా తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ప్రతి విషయం పై గల గల మాట్లాడే శ్రీముఖి తన ఎనర్జీ తో అభిమానుల్లో కూడా ఎనర్జీ నింపుతూ ఉంటుంది అని చెప్పాలి.

 బిగ్ బాస్  హౌస్లోకి కంటెస్టెంట్ గా వెళ్లి ఇక రన్నరప్  గా నిలిచిన తర్వాత శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు శ్రీముఖి తన స్నేహితులను స్టేజ్ మీద ఎడాపెడా తిట్టేయడం కూడా చూస్తూ ఉంటాం. ఇక ఇటీవల జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ పై కూడా తిట్ల వర్షం కురిపించింది శ్రీముఖి. లఫూట్ కాపురానికి పనికిరాకుండా చేస్తాను అంటూ దారుణంగా మాట్లాడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మిస్టర్ అండ్ మిస్సెస్ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే కి వచ్చేసింది.

 ఇక ఫైనల్స్ కి స్పెషల్ గెస్ట్ లు కూడా వచ్చారు. ఈ క్రమంలోనే ప్రమోషన్ కూడా గట్టిగానే చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవల  విడుదలైంది. అయితే ఇక ఈ ప్రోమోలో భాగంగా కంటెస్టెంట్స్ తో ఒక ఆసక్తికర గేమ్ ఆడించారు నిర్వాహకులు. ఇక ఈ గేమ్ లో రాకింగ్ రాకేష్, సుజాత కూడా పాల్గొన్నారు అని చెప్పాలి. ఈ ఎపిసోడ్లో పాల్గొన్న జంటలకు బాస్కెట్ బాల్  కాంపిటీషన్ పెట్టారు. ఒకరు కళ్ళకు గంతలు కట్టుకొని బాలు వేస్తే మరొకరు ఒక స్టూల్ మీద నిలుచుని దానిని బాస్కెట్ లో పడేలా చేసి గోల్ వేయాలి. అయితే రాకింగ్ రాకేష్ ఈ గేమ్ రాంగ్ అంటూ శ్రీముఖి తో వాదనకు దిగాడు. దీంతో లఫూట్ కాపురానికి పనికి రాకుండా చేస్తాను అంటూ ఒక్కసారిగా రెచ్చిపోయింది శ్రీముఖి. దీంతో రాకింగ్ రాకేష్ బిక్క మొఖం వేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: