వెనకడుగు వేస్తున్న విశ్వక్ సేన్ ధమ్కీ ..!!

Divya
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ధమ్కీ. డైరెక్టర్ గా విశ్వక్ సేన్ అంతకుముందు ఫలక్నామా దాస్ అనే చిత్రంకు కూడా విశ్వకే స్వయంగా దర్శకత్వం వహించారు. దీంతో ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.ఇప్పుడు మరొకసారి తన డైరెక్షన్ తో చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నివేదా పేతురాజు నటిస్తున్నది.

రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి ఇతరులు ముఖ్యమైన పాత్రలలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఈ చిత్రానికి లియాన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు విశ్వక్ సేన్. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకొని రెడీ అయిన ఈ సినిమా మరొకసారి బాక్సాఫీస్ వద్ద తన హిట్టు అందుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సెన్సార్ పనులు కూడా ముగించుకున్న ధమ్కీ సినిమా ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్లీ వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు.

ఈసారి మార్చి 17వ తేదీన ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేస్తారని భావించిన అభిమానులు నిరాశ ఎదురయ్యింది ఈ సినిమాని మార్చి 17 కాకుండా మార్చి 22న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతోంది. ఈ మేరకు ఒక కొత్త పోస్టర్తో ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేశారు. ఈ పోస్టర్లు విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ పాత్రలో నటించబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: