శంకర్ స్పీడ్ కి కళ్లెం వేసే ఆలోచనల్లో ఉన్నా స్టార్ ప్రొడ్యూసర్......!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన స్టార్స్ లలో ఒకరైన రామ్ చరణ్ ప్రెసెంట్ హీరోగా శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు ఒక సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సౌత్ ఇండియా లో రాజమౌళి కంటే ముందే వందల కోట్ల బడ్జెట్ తో సినిమా లు తీస్తూ భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు శంకర్ మరో సారి అదే స్థాయిలో రామ్ చరణ్ హీరో గా సినిమా ని తెరకెక్కిస్తున్నాడు.
సినిమా లోని ఒక పాట కోసం ఏకంగా 30 కోట్ల రూపాయలను శంకర్ ఖర్చు చేశాడంటే సినిమా ను ఏ స్థాయిలో రూపొందిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. తెలుగు నిర్మాతల్లో అత్యంత పొదుపైన, బాధ్యతయుతమైన నిర్మాత ఎవరు అంటే దిల్ రాజు పేరు చాలా మంది చెప్తారు. అలాంటి దిల్ రాజు తో విచ్చల విడిగా శంకర్ ఖర్చు చేయిస్తున్నాడు.
ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దిల్ రాజు ఖర్చు విషయం లో మొదట వెనకాడలేదు, కానీ ఇప్పుడు కాస్త భయపడుతున్నాడట. రామ్ చరణ్ మార్కెట్ కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో ఉంది. అయినా కూడా ఎక్కడో భయం దిల్ రాజును వెంటాడుతోందని ఆయన సన్నిహితులు గుస గుసలాడుకుంటున్నారు. చరణ్ మూవీ బడ్జెట్ శృతి తప్పుతుందని, అదుపు తప్పి ఖర్చు చేసే అప్పుడప్పుడు కష్టాలు తప్పవని దిల్ రాజు కి అనుభవం. అందుకే శంకర్ కి కాస్త కళ్లెం వేసి పట్టుకోవాలని నిర్ణయానికి వచ్చాడని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే శంకర్ బడ్జెట్ విషయం లో అస్సలు తగ్గడు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా యొక్క భారీతనాన్ని కంటిన్యూ చేస్తూ షూటింగ్ పూర్తి చేయాలని శంకర్ భావిస్తున్నాడు. కనుక ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగనుందో చూడాలి. జూన్ జూలై వరకు షూటింగ్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఇటీవల నిర్మాత ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు. ఉగాది సందర్భంగా సినిమా యొక్క టైటిల్ ని రివీల్ చేస్తారని కూడా సమాచారం అందుతుంది.
ఏదేమైనా దిల్ రాజుకి కుశంతా భయం పట్టిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: