పవన్ కళ్యాణ్ వేసిన పంచ్ కు సైలెంట్ అయిన మోహన్ బాబు..!!

murali krishna
సినీ చిత్ర పరిశ్రమ ప్రారంభం అయి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో సినీ సెలబ్రిటీస్ అందరు కూడా కలిసి వజ్రోత్సవం పేరు తో ఒక పార్టీ ని అయితే చేసుకున్నారు.దాంట్లో లెజండరీ అనే పేరు మీద చిరంజీవి కి ఒక అవార్డు కూడా ఇవ్వాలని చూసారు కానీ ఆ పార్టీ లో మోహన్ బాబు మాట్లాడుతూ తాను చేసిన గొప్ప పనుల గురించి సినిమాల గురించి చెప్తూ నేను లెజండరీ కాదా అలాగే కృష్ణంరాజు లెజెండరీ ఆర్టిస్ట్ కాదా అంటూ ఇండైరెక్ట్ గా చిరంజీవి మీద కాంట్రవర్సీ మాటలు అయితే మాట్లాడాడు.
దాంతో అదంతా పూర్తిగా విన్న పవన్ కళ్యాణ్ స్టేజి మీదకి వెళ్లి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ ఆయన్ని తమ్ముడు అని కూడా సంబోధిస్తూ మాట్లాడాడు...అలా పవన్ కళ్యాణ్ మోహన్ బాబు మీద వెటకారం గా పంచులు వేయడం తో మోహన్ బాబు కామ్ గా వచ్చి కూర్చున్నాడటా.... అలా వజ్రోత్సవ వేడుకల్లో చాలా మాటల యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు.. ఇక దాంతో చిరంజీవి కూడా
ఈ అవార్డు తీసుకోవడానికి నేను అస్సలు అర్హుడిని కాదు అని చెప్పి ఆ అవార్డు ని వెనక్కి ఇచ్చేసారటా.అలా చిరంజీవి తాను చెప్పినా ఒక్క మాట తో అక్కడ అప్పటిదాకా నడిచిన గొడవఅంతా కూడా ఒక్కసారి గా కామ్ అయిపొయింది. అందుకే అప్పటి నుంచి సినిమా హీరోలతో ఏదైనా పార్టీ చేద్దాం ఫంక్షన్ నిర్వహిద్దాం అని ఏ ఒక్క సినీ పెద్ద కూడా ప్రయత్నం చెయ్యట్లేదని తెలుస్తుంది.. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తుంటే మోహన్ బాబు మాత్రం సినిమాలు లేకుండా ఖాళీ గా గడుపుతున్నారు..అయితే రీసెంట్ గా మోహన్ బాబు కొడుకు అయిన మనోజ్ భూమా మౌనికనీ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: