రావణాసుర: మాస్ రాజాకి మరో హిట్ పక్కా?

Purushottham Vinay
రావణాసుర : టాలీవుడ్ సీనియర్ హీరో మహారాజ్ రవితేజ ప్రస్తుతం టాక్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక హీరోగా రాబోతున్న కొత్త సినిమా రావణాసుర. రీసెంట్ గా ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న రవి తేజ ఇప్పుడు రావణాసుర సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ  దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా ఇంకా అలాగే మేఘ ఆకాష్ అలాగే దక్ష నగర్కర్ లు ఫీమేల్ లీడ్ లో నటిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన అప్ డేట్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసి మాస్ అభిమానులకు కిక్కిచ్చారు హీరో రవి తేజ. 


ఒక నిమిషం 6 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని సీన్లు ఆధ్యంతం ఆకట్టుకుంటున్నాయి. తాను టార్గెట్ చేసినవారిని అంతం చేస్తూ వెళుతున్న హీరో రోల్ అనేది చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. 'సీతను తీసుకొని వెళ్లాలంటే కేవలం సముద్రం దాటితే సరిపోదు.ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి' అనే డైలాగ్ ఈ వీడియోలో బాగా హైలైట్ అయింది.మాస్ ఆడియన్స్ కోరుకునే స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోందని, అందుకు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాని చాలా గ్రాండ్ గా రూపొందిస్తున్నారని సమాచారం. అందుకు తగ్గట్టుగానే తాజాగా వదిలిన టీజర్ అయితే సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో రవి తేజ పాత్ర సినిమాకి ప్రధాన బలం అని ఈ మూవీ టీజర్ కన్ఫర్మ్ చేసింది.రావణాసుర... మాస్ రాజా రవితేజకి మరో హిట్ పక్కా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: