బాలకృష్ణతో అలా ప్లాన్ చేస్తున్నారా..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన వీర సింహా రెడ్డి అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ ... దునియా విజయ్ విలన్ పాత్రలలో నటించిన ఈ మూవీ లో హాని రోజ్ ఒక కీలకమైన పాత్రలో నటించింది.

ఇలా వీర సింహా రెడ్డి మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ఇప్పటికే ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ సీజన్ 1 కు మరియు సీజన్ 2 కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. ఈ రెండు సీజన్ లు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. కెరియర్ లో మొట్ట మొదటి సారి ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ తన వాక్ చాతుర్యంతో అన్ స్టాపనుల్ సీజన్ 1 ను మరియు 2 ను కూడా సూపర్ సక్సెస్ చేశాడు.

ఇది ఇలా ఉంటే ఈ టాక్ షో వల్ల బాలకృష్ణ కు అల్లు అరవింద్ లకు మధ్య సానిహిత్యం కూడా చాలా వరకు పెరిగింది. ఈ సానిహిత్యం తోటే అల్లు అరవింద్ ... బాలకృష్ణ తో ఒక వెబ్ సిరీస్ ను ఆహా "ఓ టి టి" లో ప్లాన్ చేస్తున్నట్లు ... మరికొన్ని రోజుల్లోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: