లారెన్స్ "రుద్రుడు" మూవీ తెలుగు రైట్స్ ను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
రాఘవ లారెన్స్ ఇప్పటికే ఎన్నో సినిమాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి అద్భుతమైన డాన్సర్ గా పేరు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో నటించి నటుడి గాను ... ఎన్నో సినిమాల్లో హీరో పాత్రల్లో నటించి అద్భుతమైన హీరో గాను మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇలా డాన్సర్ గా నటుడి గా తన కంటూ ఒక సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న లారెన్స్ ప్రస్తుతం రుద్రుడు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

కథిరేసన్ దర్శకత్వంలో ఎంతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి సంస్థ వారు చాలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో రాఘవ లారెన్స్ సరసన యంగ్ బ్యూటీ ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని పాన్ ఇండియా రేంజ్ లో సమ్మర్ కానుక గా ఏప్రిల్ 14 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ యొక్క తెలుగు థియేట్రికల్ హక్కులను పిక్సెల్ స్టూడియోస్ వారు దక్కించుకున్నారు. ఈ మూవీ ని ఈ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే ఎన్నో సినిమా లతో మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న లారెన్స్ మరియు రుద్రుడు మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: