తండ్రే తనపై లైంగికంగా వేధించారంటున్న ఖుష్బూ..!!

Divya
సీనియర్ హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాల నటిగ మొదట తన కెరీర్ను ప్రారంభించిన ఖుష్బూ వెంకటేష్ తో కలిసి మొదట కలియుగ పాండవులు అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది ఈ అమ్మడు. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది ఇక హీరోయిన్ నుంచి రిటైర్డ్ అయినప్పటికీ పలు చిత్రాలలో సపోర్టింగ్ యాక్టర్ గా కూడా నటించి బాగా పేరు సంపాదించింది.

ఇదంతా ఇలా ఉంటే తాజాగా కుష్బూ మహిళలపై జరుగుతున్న కొన్ని లైంగిక వేధింపుల పైన కూడా రియాక్ట్ కావడం జరుగుతోంది .తన చిన్నతనంలోని జరిగిన లైంగిక వేధింపుల గురించి తెలియజేస్తూ పలు సంచలన విషయాలను తెలియజేయడం జరిగింది. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లుగా తెలియజేస్తోంది హీరోయిన్ ఖుష్బూ. తన తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లుగా తెలియజేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే అప్పుడు తన వయసు కేవలం ఎనిమిది సంవత్సరాల పదిహేనేళ్లు వచ్చాక తన తండ్రిని ఎదిరించానని తెలియజేసింది ఖుష్బూ.

దీంతో తన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయారని తెలియజేస్తోంది .లైంగిక వేధింపుల పైన ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ముంబైలో ముస్లిం కుటుంబంలో జన్మించిన ఖుష్బూ చిన్నప్పటి నుంచి తన నటన పైన ఆసక్తి ఉండడంతో వినోద్ కన్నా హీరోగా నటించిన బర్నింగ్ ట్రైన్ అనే చిత్రం ద్వారా మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చానని తెలియజేసింది. ప్రస్తుతం తమిళ దర్శకుడు నటుడు పి సుందరను వివాహం చేసుకుంది. అది కూడా ప్రేమించి మరి వివాహం చేసుకుంది ఖుష్బూ. బిజెపి పార్టీ తరపున కూడా రాజకీయ నాయకురాలుగా బాగా పేరు సంపాదించింది ఖుష్బూ. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: